వ్యవ"సాయం"

by 11:11 AM 2 comments
మనం అందరం దాదాపు రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే... చిన్నప్పుడు ఆ పొలాల్లో పడి పని చేసిన వాళ్ళమే.. మనకి అప్పుడు ఏమి తెలీదు, పని కొంచెం కష్టం అనిపించేది అంతే. ప్రతి సీజన్ లో పచ్చగా ఉండి పొలాలన్నీ ఏదో ఒక పంట తో ఓ కళ కళ లాడుతూ ఉండేవి. ఇంటి దగ్గర కూరగాయలు కొనడం కూడా తక్కువే. ఇంటి పెరట్లో అల్లుకున్న దొండ పాదులు,సొర పాదులు,కాకర పాదులు , పొట్ల పాదులు, ఆకు కూరలు. పొలాన్నున్చి తెచ్చుకునే పచ్చి మిరపకాయలు,టమాటో లు, గోంగూర. మన చేలో పండే కంది పప్పు , మినప్పప్పు,వేరు సెనగ. ఇవన్నీ మనం చూశాం.కానీ మన ముందు తరాన్నుంచి ఆ అనుభవాన్ని మాత్రం అందుకోలేక పోయాం.
మనకి నెల జీతం వస్తుంది కాబట్టి కొంచెం రేట్లు పెరిగినా కొనుక్కో గలుగుతున్నాం. కానీ పల్లెటూర్లలో ఈ వ్యవసాయాన్ని బతికించడానికి మన ముందు తరం ఇంకా పోరాడుతూ ఉంది. ఎవరికైనా ఒక వయసు వచ్చాక విశ్రాంతి అవసరం. మన తాతల నుంచి తండ్రులు అందిపుచ్చుకున్నారు. కాని వారి నుంచి అంది పుచ్చుకునే వారు లేకపోయారు. వయసు 60 వచ్చినా వాళ్ళే పొలం పని చేయాల్సిన పరిస్థితి. ఒక్క ముక్కలో చెప్పాలంటే వ్యవసాయం చచ్చిపోతుంది. కారణాలు చాలానే ఉన్నాయి.
1.ఆదాయం లేకపోవడం .
2.నష్టం వస్తే ఆదుకునే వాళ్ళు లేకపోవడం(5౦౦౦౦ పెట్టి కొన్న బైక్ ఇన్సురన్సు ఉంది కానీ ప్రజల కడుపు నింపే పంట కి లేదు)
3.ప్రకృతి లో మార్పులు.
4.కూలి ఖర్చులు పెరగడం , కూలి వాళ్ళు దొరక్కపోవడం.
5.పంట చేతికి వచ్చాక ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన కొనుగోళ్ళు లేకపోవడం. అప్పుడు తీర్చాల్సిన అప్పులు కోసం ఎంతో కొంత కి అమ్మి వాటికీ కట్టి ఖాళీగా ఉండటం. మళ్ళీ పంట కోసం అప్పు చేయడం. ఎందుకంటే వాళ్ళకి ఆ పని తప్ప ఇంకోటి రాదు. వెనక చేయి వేసి ఆసరా ఇచ్చే బిడ్డలు లేరు. ఇంత కష్టం చూసాక ఎ రైతు తన పిల్లల్ని వ్యవసాయం చేయమని చెప్పడు.
మనలో చాలా మందికి ఇవన్నీ తెలుసు. కాని మన జీవితపు పరుగులో పడి ఒక నిట్టూర్పు మాత్రం ఇవ్వగలుగుతున్నాం.
మనకి తెల్సు ఎంత మంది రైతులు బలవంతగా బతుకు ముగిస్తున్నారో. పరువు కోసం బ్రతకలేక ప్రాణాలు తీసుకునే ఒక రైతు విలువ పేపర్లో ఒక మూల  ఉండచ్చేమో కానీ ఆ నష్టం ఆ కుటుంబానికి ఎవరు తీర్చలేరు. వ్యవసాయం చేయడం అంటే పచ్చని పంట పొలాల్లో భుజం మీద కర్ర వేసుకొని ముందు వెళ్ళే ఎద్దుల వెంట కూని రాగాలు తీస్తూ నడవడం కాదు. ఎర్రటి ఎండలో శరీరం సహకరించించక పోయినా ఆ రోజు వెయ్యాల్సిన ఎరువు వెయ్యకపోతే మొక్కలు చచ్చిపోతాయని పాకులాడటం. ఇది పిల్లల కోసం తండ్రి పదే బాధ.
ఇదంతా ఎందుకు అంటే, నాదొక చిన్న ఆలోచన నచ్చితే ప్రయత్నిచండి.
మనం అందరం బియ్యాన్ని 25KG లు 1800 పెట్టి కొంటున్నాం. సగటున ముగ్గురు ఉన్న కుటుంబానికి ఏడాదికి 13 నుంచి 15 వరకు బియ్యం బస్తాలు అవసరం అవుతాయి. కూరగాయలకి,పప్పు ధాన్యాలకి అంతా కలిపి 20,000 దాక ఖర్చు అవుతుంది. అంటే బియ్యం తో కలిపి మొత్తం 40000  దాకా ఖర్చు అవుతుంది. మనలా కార్పొరేట్ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఒక కంపెనీ లో 50 మంది కలిసి దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరి కి వెళ్ళి అక్కడ ఉన్న రైతులకి పెట్టుబడి పెట్టి ఆ పంటని మనమే కొనుక్కుంటే కొన్ని కుటుంబాలని బ్రతికించిన వాళ్ళం అవుతాం... అప్పుడప్పుడు వెళ్తుంటే  మన పిల్లల కి కూడా ప్రకృతి తో పరిచయం అవుతుంది. వాళ్ళలో కూడా సాటి మనిషికి గౌరవంగా సాయం చేయచ్చు అన్న ఆలోచన వస్తుంది. వారంతం లో షాపింగ్ మాల్ కి వెళ్ళడం కన్నా పచ్చని పొలాల్లో తిరగడం మనసుకి,మనషికి రెంటికి మంచిదే....

ఇది నా ఆలోచన మాత్రమే నచ్చితే పంచుకోండి.... అందరికి షేర్ చేయండి, ఎవరో ఒకరు ఇంకో మంచి ఆలోచన వచ్చినా సంతోషమే ...

2 comments:

  1. మీకున్న బిజీ లైఫ్ లో ఇలాంటి ఆలోచన వచ్చినందుకు చాల అభినందనలు.ధాన్యం పండించే రైతుకి సాధారణంగా 20000 ఖర్చవుతుంది.కొన్ని పద్ధతుల లో పండిస్తే 4000 కూడా దాటని పరిస్థితులున్నై.అవి అనుసరిస్తే పండించే వారికే కాదు తినే వారికీ ఆరోగ్యమే.cow based organic rice cultivation ఇది చాల పాత పద్ధతే కానీ చాల మంది రైతులు fertilizers and pesticides కి అలవాటు పడి దీన్ని మర్చిపోయారు.remunerative కాదు అనుకుంటారు.కానీ అంతే yield ఇస్తూ తక్కువ ఖర్చు తో ఎక్కువ డబ్బలు సంపాదించేవారు నాకు తెలుసు.as an agrico i am very sure in it. మొట్టమొదటి సారి నేను ఆ fields చూడగానే నాకు కూడా పొలముంది ఉంటే ఎంత బావుండేది అన్పించింది.ఈ phd అవసరమా అనిపించింది.కాని రైతు కి కావాల్సింది మార్కెటింగ్. అంత కస్టపడి పండించాక రైతు కి ఆమ్మడాన్కి ఓపిక ఉండదు.practical గ నేను face చేసిన పరిస్థితి అది. ఇక్కడ మీ ఆలోచన చాలా బావుంది..మనమే ఒక గ్రూప్ గ ఏర్పడి mass purchase చేయగలిగితే he will be వెరీ happy ఫార్మర్. Costeffective technologies గురించి నేను help చేయుగలను.కొనుక్కునే వాళ్ళు ముందుకు రావాలి. అది 100% organic ప్రోడక్ట్ మనం తింటున్నాం అని నమ్మాలి. developed కంట్రీస్ లో పది రెట్లు ఎక్కువిచి కొంటున్నారు అదే ప్రోడక్ట్ ని అని గ్రహించాలి.మనం సాధారణంగా ఉండే రేట్ కె కొనుక్కున్న కూడ రైతు కి cost ఎఫ్ఫెక్టీవ్ టెక్నాలజీ వల్ల కేఉద లాభ పడతాడ.. నేను జి+ వాడను.మా అన్నయ rajkumar.neelam వల్ల ఈ పోస్ట్ చూడగలిగాను,నాకు తెల్సింది పంచుకోగలిగాను.. 9441808292 కి అవసరమైతే ఎవరైనా ఈ విషయం లో కాల్ చెయ్యగలరు. thank you...

    ReplyDelete
  2. బాగుంది నరేష్! పొలాలు, రైతుల పట్ల నీ అభిమానానికి, ఆవేదనకి హ్యాట్సాఫ్ అబ్బా!!

    ఒకప్పుడు విత్తనాలు, ఎరువులు సొంతంగా ఏర్పాటు చేసుకునేవాళ్లు రైతులు. అవసరమైతే మాత్రమే పంటకు సత్తువ కోసం ఏ యూరియా లాంటి పెట్టుడు ఎరువులో; అలాగే చిన్నాచితకా తెగులో, పురుగో పడితే ఒకటో రెండోసార్లు కొట్టే (స్ప్రే) మందులో వాడేవాళ్లు. సీజన్స్ బానే ఉండేవి. దిగుబడి బానే ఉండేది. మార్కెట్లో దళారుల దందా ఈ లెవెల్లో ఉండేది కాదు. మన చిన్నప్పుడు రైతులు, ఊళ్లు సంతోషంగా ఉండేవి. కానీ.. అగ్రికల్చర్ లోకి పెద్ద పెద్ద MNCs రంగప్రవేశం చేశాక.. పరిస్థితి మారిపోయిందేమో. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి అనే ఆకర్షణీయ పథకాలతో (ఇప్పటి ఫేసుబుక్కోడి free basicsలా) మెల్లగా సాంప్రదాయ వ్యవసాయానికి స్వస్తి పలికేలా చేసి... వాణిజ్య పంటలవైపు రైతుల్ని మళ్లించారు. Once they get habituated and addicted to this type of forming, ఇక వాళ్ల లాబీ పనిచేయడం మొదలెట్టిందేమో. నాసిరకం విత్తనాలు, నాసిరకం ఎరువులు, కల్తీ పురుగుల మందులు, దిగబడి పెద్గగా రాకపోవడం, కొన్ని పంటలకు అలవాటు పడ్డాక భూములు వేరే పంటలకు అస్సలు పనికిరాకపోవడం, తీరా పంట చేతికొచ్చే టైంకి మార్కెట్లో రేట్లని తగ్గిపోయేలా చేయడం, అదే విత్తనాలు కొనే టైంలో మాత్రం బీభత్సంగా రేట్లు పెంచేయడం ఇలా... మొత్తంగా అన్నదాత వెన్ను విరిచే ప్రయత్నాలు ఈ పది పదిహేనేళ్లలో చాప కింద నీరులా జరిగిపోయాయేమో. ఇదంతా కూడా కరప్ట్ ప్రభుత్వాలు, Big MNCs కలిసే చేశాయని చెప్పాలేమో. ప్రస్తుతం ఊళ్లల్లో పెద్ద రైతులు.. పేద రైతులుగా; పేద రైతులు... కూలీలుగా, కూలీలు.. నగరాల్లో ఆ రోజుకు పని దొరికితే ఇళ్లు కట్టే లేబర్ గా మారిపోయారు. షిఫ్ట్ అవలేక, నేలనే నమ్ముకున్న ఎందరో రైతులు నిస్సహాయులై తనువు చాలించిన వారూ ఉన్నారు. ప్రస్తుతం అంతా కార్పొరేట్ ఫామింగ్ అనుకుంటా. మా మావయ్య తన 30 ఎకరాల పొలంలో తను ఏది కావాలనుకంటే ఆ పంట వేసేవాడు... కానీ ఇప్పుడలా కాదు... ITC వాడు... ఈ పొలాన్ని లీజ్ తీసుకుంటాడు... ఏ విత్తనాలు వాడాలో, ఏ ఎరువులు వాడాలో, ఏయే స్ప్రే మందులు వాడాలో... ఎప్పుడెప్పుడు ఏమేం చేయాలో చెప్పి... చివర్లో దిగుబడి వాడే కొంటాడు... ప్రోడక్టు నాణ్యతలో ఏమాత్రం తేడా వచ్చినా... వాడి రేట్ లో గణనీయంగా కోత పడుద్ది. రైతు జేబుకు చిల్లు పడుద్ది.

    హ్మ్... నా తరఫున కొంత ఆక్రోషం, ఆవేదన!

    ReplyDelete