సామాన్యుడి అవినీతి

by 12:41 AM 2 comments


అవినీతి...ఇప్పుడు ఎన్నో విషయాలకన్నా ముఖ్యమైన విషయం.అందరు మాటాడుకుంటున్న విషయం. అన్నా హజారే అవినీతికి వ్యతిరేకం గా దీక్ష మొదలుపెట్టగానే అందరు ఆయనకి మద్దతు ప్రకటించారు.చివరకి రాజకీయనాయకులు (చివరికి అని ఎందుకు అన్నానంటే నా ద్రుష్టి లో ప్రతి రాజకీయ నాయకుడు ఏదో దశ లో అవినీతి చేసినవాడే ) కూడా. మీరు అడగవచ్చు ,ఏం మీరంత నీతి పరులా అని.తప్పకుండ మీకు సమాధానం చెప్తాను.రాజకీయనాయకులే కాదు,కార్పోరేట్ ఉద్యోగులు,విద్యార్ధులు,సామాన్య ప్రజ కూడా ఆయన్ను సమర్ధించారు.మనలో అనుకునే ప్రతి ప్రశ్న,మనకి ఎదురయే ప్రతి సమస్య కి ఆయన్నో ప్రతిక గా భావించాం.ఈ వయసులో ఉన్న ముసలాయన ఎ లాభాపేక్ష లేకుండా  జనం కోసం ఏదో చేస్తాడంటే నమ్మాము.లోక్పాల్ బిల్లు వలన ఎమోస్తుందో చాలామందికి తెలీదు, తెల్సిన వాళ్ళకి అది సరిగ్గా అమలౌతుందో లేదో కూడా అనుమానమే.ఎందుకంటే మనకున్న A.C.B, CBI ,judicial,lokayuktha లు ఎంత బాగా పనిచేస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. మనం నలుగురిలో ఉన్నపుడు "అన్నా కి మద్దతు గా ఏదోటి చేయాలి " అంటే, "అవినీతి ని తగ్గించడం ఎవరివల్ల కాదు, మార్పు ముందు మనలో రావాలి,ఏం మనమంత నీతి పరులమా?మనము కూడా ఏదో దశ లో అవినీతి చేసిన వాళ్ళమే" అని అంటారు ఎవ్వరో ఒకరు.నిజమే కదా.కాని మనం అవినీతి ఎందుకు చేస్తున్నాం?ఎందుకు చేయాల్సి వస్తుంది.
ముందుగా అవినీతి లో మనమెక్కడ భాగామౌతున్నామో చూద్దాం. ఉదాహరణకి తిరుపతి వెంకన్న దర్శనం.ఇక్కడ దర్శనం కావాలంటే ఉచిత దర్శనం,ఇంకా వి ఐ పి ఇలా చాలానే ఉన్నాయి.మనం ఉచిత దర్శనం లో వెళ్ళం(ఇలా అనే కంటే వెళ్ళలేం అంటే బాగుంటుంది.). కనుక ఒక ఎం ఎల్ ఎ దగ్గర్నుంచి ఉత్తరమో, లేదా ఒక బ్రోకర్ ని పట్టుకోడమో చేస్తాం.సదరు ఎం ఎల్ ఎ తెలిస్తే పర్లేదు కాని బ్రోకర్ అయితే మాత్రం బాది వదిలేస్తాడు.దేవుడ్ని చూసిన ఆనందం లో సమర్పించుకుని వచ్చేస్తాం.ఇది తప్పే కదా?మరి నీతిపరులైతే ఉచిత దర్శనం,మీ శక్తి ని బట్టి అక్కడ ఉన్న దర్శనాలలో ఏదోటి ఎంచుకుని వెళ్ళొచ్చు.కాని మనకి ఏది సౌకర్యమో అదే చేస్తాం.ఇక్కడ నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి.మనకి కావాల్సింది ప్రశాంతంగా దేవుడి దర్శనం కావడం.అంతే కదా.
1.       ముందు దేవుడి దగ్గర ఇన్ని తారతమ్యాలు ఎందుకు?ఉన్న వాడు లేని వాడు అన్న తేడా ఆయనే చూపించంప్పుడు ఆ హక్కు మీకేవరిచ్చారు? ఈ మాట అంటే ఉన్న వాళ్లకి(సాఫీగా దర్శనం అయ్యే వీలున్న వాళ్లకి ) కోపం వస్తుంది.కాని వీళ్ళు కూడా ఎక్కడో ఓ చోట అవినీతికి బలి అయి బాధపడతారు.
2.      ఏం , టి టి డి సాఫీగా దర్శనం ఆయె మార్గం చూపిస్తే మేమెందుకు ఇలా చేస్తాం.రోజు వారుగా కొన్ని వేల మంది దర్శనం చేసుకోడానికి వస్తుంటే, వి ఐ పి లు రాగానే అందరిని క్యు లో ఆపేసి వారికి దర్శన భాగ్యం కలగా చేస్తారు. ఆశ్చర్యం గా ఆ వి ఐ పి లు కూడా అవినీతికి వ్యతిరేకం గ నినదిస్తారు.వాళ్ళ వాదన ఏంటంటే ,మమ్మల్ని చూస్తే జనం ఎగపడతారు ,సెక్యూరిటీ సమస్య అని.మరి మీ వి ఐ పి ల కోసం ఓ రోజు కేటాయించుకోండి.ఇది వాళ్లకి కూడా తెల్సు.కాని వారోచ్చారని మనకి కూడా తెలియాలి కదా! ఇది ఒక ఉదాహరణ మాత్రమే.ఇక్కడ నేను చెప్పేది ,ప్రభుత్వం సరైన సౌకర్యం కల్పిస్తే అవినీతికి తావు లేదు.
3.      ఇంకో ఉదాహరణ, పండగ రోజుల్లో స్పెషల్ సర్వీసులు నడుపుతుంది RTC.మీకు బస్సు దొరకలేదనుకోండి, స్పెషల్ సర్వీసులో వెళ్ళొచ్చు.కాకపోతే చార్జి కొంచెం ఎక్కువ,బస్సు కూడా స్పెషల్ గానే ఉంటుంది(మూల పడి ఉన్న, లేదా ఎక్కడో నడుస్తున్న సేర్విసులని తెచ్చి ఇక్కడ వాడతారు.). ఏం అవసరమైనపుడు బస్సుల సంఖ్య పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా? తత్కాల్ అని ఒక సర్వీసు ఉంది రైల్వే లో .నాకు ఇప్పటికి అర్ధం కాదు అది ఎందుకో.బ్లాకు లో సినిమా టికెట్ అమ్ముకునే దానికి దీనికి తేడ ఏంటి. ప్రభుత్వం ప్రజల కోసం ఉన్నప్పుడు ఇన్ని తార తమ్యాలు ఎందుకు? ఉన్న వాడు ప్రైవేటు బస్సు కి వెళ్తాడు.మరి లేని వాడు. తత్కాల్ టికెట్ బుక్ చేయడం అవినీతి కాదా? దీన్ని ప్రోత్సహిస్తుంది ఎవరు ప్రభుత్వం కాదా? 
4.      మీకు EAMCET లో సీటు రాలేదనుకోండి, మేనేజిమెంటు కోటా లో దొరుకుతుంది.అక్కడ కావాల్సింది అర్హత కంటే డబ్బు ముఖ్యం.డబ్బు లేకపోతే మేనేజిమెంటు కోటా లో వచ్చిన వాళ్ళ కంటే మెరుగైన విద్యార్ధుల చాల మంది తమ దారిని మార్చుకుంటున్నారు. ఇది ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం కాదా?

లగ్జరీ(సౌకర్యాలు) డబ్బుతో కొంటె ఫర్లేదు కాని, కొన్ని డబ్బుతో ముడి పెట్టకుండా ఉంటె నే బాగుంటుంది.అందులో విద్య ,వైద్యం,తిండి ఇలాటివి. ప్రభుత్వం అలా చేయాలి అంటే అది బాధ్యత గలదై ఉండాలి. దాన్ని మనమే ఎన్నుకోవాలి. కాని మనకి వేరే దారి లేదు. ఉన్న వాళ్ళలోనే ఎవర్నో ఒకరిని ఎన్నుకోవాలి.ఉన్న వాళ్లంతా అదే బాపతు ఐనప్పుడు, మనమేం చేయగలం. కోడి ముందా గుడ్డు ముందా సామెత అవుద్ది. కాని ఒక్కటి మాత్రం నిజం సామాన్యుడి కి అవినీతి చేయడానికి ఆస్కారం ప్రభుత్వమే ఇస్తుంది.కాదనగలరా? మీకు తెలిస్తే ఇంకేదైనా చెప్పండి.

2 comments:

  1. Satisfied with this blog... satisfied in the sense... all the fire in me has been kept as letters and words here

    ReplyDelete
  2. @మాధురి గారు ధన్యవాదాలు.

    ReplyDelete