ఈ రోజుకింతే

by 1:50 AM 5 comments

ఈ రోజు కొన్ని ఆసక్తి కరమైన సంఘటనలు జరిగాయి. నాకు మాత్రమే ఆసక్తి కలిగించాయి.

మొదటిది..
 శ్రీ రామరాజ్యం చిత్రం విడుదల సందర్భం గా ఎవరో రజక సంఘం నాయకుడట కోర్టు కి వెళ్ళాడు. ఎందుకో చెప్పనా..చాకలి తిప్పడి పాత్రని తొలిగించాలని, దాని వల్ల వారి మనో భావాలూ దెబ్బ తింటున్నాయట. 
 విచిత్రం గా ఉన్నా ఇది ప్రస్తుతానికి ట్రెండ్. ఏం చేసినా ఎవరో ఒకరి మనోభావాలు దెబ్బ తింటున్నాయి ఈ మధ్య. రామాయణం లో వారధి కట్టే టపుడు , తన వంతు సహాయం చేసి ఉడుత చరిత్ర లో నిలిచిపోయింది. అందరు రామాయణం లో భాగస్వామ్యులు అయినందున ఆనంద పడ్డారే కాని, ఎవరు మనో భావాలు చూసుకోలేదు.ఇది పురాణం, కొంత మంది కి పుక్కిట పురాణం. కాని మన సంస్కృతిని , దేశాన్ని గౌరవించే వాళ్లకి ఇది మాత్రం మహా గ్రంధం. ఎన్ని సార్లు చదివినా, అందులో రావణుడు కూడా గొప్ప గానే కనిపిస్తాడు. ఒకప్పుడు ప్రతి ఒక్కరు వారి వృత్తులని గౌరవించేవారు. ప్రతి ఒక్కరికి పరస్పరం అవసరం ఉండేది. అందరు ఒకరి మీద ఒకరు ఆధార పడి బ్రతికేవాళ్ళు. కుల వివక్ష ఉండేది..దాని మీద చైతన్యం తీసుకురాకుండా దాన్ని రాజకీయం చెయ్యడం మాత్రం ఇప్పుడే మొదలయింది. ఇప్పుడు ఎవ్వరు కుల వృత్తులు చెయ్యడం లేదు. ఎంతో మంది చదువుకుంటూ మంచి ఉద్యోగాల్లో బ్రతుకుతున్నారు. ఐన సరే కాదేది కవిత కనర్హం అన్నట్టు....

రెండవది..

నేను ఈ రోజు కూరగాయల మార్కెట్ కి వెళ్లాను. మధ్యాహ్నం కావడం తో జనాలు పల్చగా ఉన్నారు. నాక్కవల్సినవి కొనుక్కుంటు, దోసకాయల దగ్గర ఆగాను. KG 10 రూపాయలు. ఇద్దరు దంపతులు వచ్చారు. ఆవిడ అడిగింది , అమ్మే వాడు కొలుస్తున్నాడు. ఈ లోగ ఆవిడ ఏరుతున్నట్టు ఒక కాయ తీసి ఆమె సంచిలోకి జార వేసింది. నేను ఆమెను చూస్తున్నాను. ఏమి జరగలేదన్నట్టు గా దోస కాయలు సంచిలో పోయించుకొని ఎంచక్కా వెళ్ళిపోయింది. నాకైతే చాల నవ్వు వచ్చింది.ఎవరన్న చూస్తే, అల్లరి చేస్తే , ఎంటమ్మ ఈ పని అని నిలదీస్తే? అంటే ఎప్పుడన్నా ఇలా చేయాలన్న సరదా అందరికి ఉంటుందేమో కదా. కాని ఇది మనతో మన పిల్లలు ఉండి చూస్తే తప్ప కుండ అది వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. లేకుండా చేయమని కాదు, ఇలా చేస్తూ ఛి ఏంటి దేశం ఇలా అయిపోతుంది అనే ఎడవకుంటే చాలు. 

మూడవది 

the davenci code అనే సినిమాని తెలుగులోకి అనువదించారు. అదే చూస్తున్న. ఒక సన్నివేశం, హీరో ని ఒక పోలీసు ఒక మ్యుజియం లోకి తీసుకు వెళ్తూ ఉంటాడు. అక్కడ ఒక పిరమిడ్ ఉంటుంది. అది చూసి హీరో అంటాడు " ఇది పెద్ద కళంకం " అని. నేను దిగ్బ్రాంతి చెందాను (ఖంగారు పడకండి ఎవరి మృతికి కాదు ). అది కళాఖండం కదా ని ఓ సారి వెనక్కి వెళ్లి చూస్తే నిజమే "కళాఖండం కాస్తా కళంకం అయింది ". ఆ సినిమా ఇంగ్లీషు లో అర్ధం కాదని ,తెలుగులో చూద్దాం అనుకున్నందుకు తగిన శాస్తే జరిగింది. మనకి తెలుగు లో కొన్ని అక్షరాలూ తీసేశారు కదా , ఋ, లు (తీసేసిన  లు ),బండి ర , ఇలా. అలానే కొన్ని పదాలు కూడా చచ్చి పోయే రోజు దగ్గరలో ఉండి. దాని స్థానే ఇంగ్లీష్ పదాలు చేరిపోతున్నాయి. పచ్చి తెలుగు లో మాట్లాడుకుందాం అంటే మనకే సిగ్గు గా ఉంటుంది, ఏంటి పదాలు అని. కోపం వస్తుంది కదా, ప్రయతించి చూడండి. ఎందుకంటే మనం ఇప్పటి భాష కి అలవాటు పడిపోయాం.

నాలుగవది 
మనం రోడ్ టాక్సు ఎందుకు కడుతున్నాం? ఇలాటివి అడగద్దు. కట్టమంటున్నారు , కడుతున్నాం అంతే అంటారా!  అంతేలెండి.కట్టడం వరకే మన వంతు, అది ఎలా ఉపయోగపడుతుందో తెలీదు , అవసరం లేదు. బాగా ఇబ్బంది వస్తే (అంటే రోడ్లు బాగాలేకనో, ప్రభుత్వ సేవలు బాగాలేకనో) ఛి *(*()&(*&%&^%&@#$ అని నాలుగు బూతులు తిట్టుకొని జన జీవన స్రవంతి లో కల్సిపోతుంటాం. ESI  నుంచి బొరబండ మీదుగా HItech సిటీ కి వెళ్ళే దారి ఉందీ, అద్భుతం. దాన్ని రోడ్డు అనడం కంటే పేరు దొరకడం లేదు, మేరె ఏదో పెట్టేసుకోండి. ఈ రోడ్డు చూసాకే నాకు రోడ్ tax   గుర్తు వచ్చింది. అంత దారుణమైన రహదారి పల్లెటూర్లో కూడా చూడలేదు. నిత్యం కొన్ని వేల వాహనాలు తిరిగే దారి ఎలా ఉండాలి? అన్ని గుంటలే , కాదు గుంతల మద్యలో అక్కడక్కడ రోడ్డు ఉందీ. ఇరుకు దారి, దుమ్ము లేపుతూ RTC బస్సులు , లారీలు , ఆటో లు , క్యాబులు..బైక్ మీద పోతే వారం రోజుల్లో మీరు మీ బండి షెడ్డుకెళ్ళడం ఖాయం.
ఇది కాకుండా నగరమంతా ఎక్కడ పడితే అక్కడ ఆపే పోలీసులు, ట్రాఫ్ఫిక్ పోలీసులు. అన్ని అడుగుతారు. RC , license , insurance , pollution check . అస్సలు pollution   check ఎందుకో నాకు అర్ధమే కాదు. నన్ను ఆపి నాచేత చలాన్ కట్టించుకుంటూ ఉంటె నా ముందే ఎన్నో ధూమ శకటాలు నల్లటి పొగ వదులుతూ వెళ్తూ ఉంటాయి. ఏమిటిది అని అడిగితే ఎక్కడ ఇంకో వంద అంటారని వచ్చేయ్యడమే. మీకు తెల్సా ఈ  pollution check ఎందుకో? నాకు అనిపిస్తుంది , ఎవరికో డబ్బు కోసం ఏదో కాంట్రాక్టు కట్టబెట్టడం కోసం మొదలుపెట్టిందే అని. ఎంత పొగ వచ్చే బండి కైనా , expire (కాలం చెల్లని ) కాని pollution check ఉంటె చాలు దర్జాగా తిరగచ్చు. ఈ రోడ్ల మీద మనకి మైలేజి రాదు, బండి పాడు అవుతుంది ఐన సరే వీళ్ళు రోడ్లను సరిగ్గా పట్టించుకోకుండా మన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తారు. సిగ్గు మాలిన బ్రతుకులు అనాలనిపిస్తుంది కదా...ఉద్యోగులది కాదు ప్రభుత్వానిది.

5 comments:

  1. నిజమే, మీరు రాసినవన్నీ నిత్యజీవితంలో మనకు తారసపడే సంఘటనలే. కోర్టులకు వెళ్ళటం , మనోభావాలు దెబ్బ తినటం మరీ కామన్ అయిపోయింది. దొంగతనం లాంటిదాన్ని గురించి వ్రాశారే, కెమెరాలు ఉన్న షాపుల్లో రెడ్ హాండెడ్ గా పట్టుపడిన వాళ్ళల్లో లక్షాధికారులు కూడా ఉంటారుట. అదో బలహీనత అని ఒక సారి టీవిలో ఒక కార్యక్రమంలో వివరంగా చూపించారు.

    ReplyDelete
  2. ఎర్రగడ్డ నుంచి బోరబండ మీదుగా హైటెక్ సిటీకి రాలేకా ఇల్లు మార్చాము మేము.

    ReplyDelete
    Replies
    1. :) nenu kooda andi..debbaki dilsukhnagar ki vellipoyaa..

      Delete
  3. The Davinci Code లో ఆ పాత్ర భావాన్ని మీరు తప్పుగా అర్ధం చేసుకున్నారు. తెలుగు అనువాదం నేను చూడలేదు కానీ 'ఇది పెద్ద కళంకం' అని ఉంటే వాళ్లు సరిగానే అనువదించినట్లు. ఎందుకంటే, ఆంగ్లంలో ఆ వాక్యం ఇలా ఉంటుంది: 'A scar on the face of Paris'.

    ఆంగ్లంలో అలా ఎందుకుందంటే నేను కథ మొత్తం మళ్లీ చెప్పాల్సుంటుంది :-)

    ఇంతకీ, ఆ డైలాగ్ చెప్పేది కథానాయకుడు కాదు. Bezu అనబడే మరో పాత్ర.

    ReplyDelete
    Replies
    1. క్షమించాలి, అందుకే ఇంగ్లీష్ అర్ధం కాదని తెలుగులో చూస్తే అందులో కూడా కొంతే అర్ధం అయిందని అర్ధం ఐంది..ధన్యవాదాలు

      Delete