మల్లన్న పండగ

by 11:03 AM 3 comments
మల్లన్న పండగ...

నేనైతే ఈ పండగ కోసం ఎదురు చూసేవాడిని. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది తిండి పండగ, తినేవాళ్ళకి పండగ...

మా ఇంట్లో అడిగితే, కరువు వస్తే ఈ పండగ చేస్తారంట.కరువు తీరిపోవడానికి అన్నమాట.

ప్రతి ఇంట్లో ఎవరి స్తోమత కి తగ్గట్టుగా పిండి వంటలు చేస్తారు... ఇంటికి ఒక మల్లన్న ఉంటాడు... ఒక రాయికి నామాలు పెట్టి పూజ చేస్తారు...దేవుడికి నైవేద్యం పెట్టి, మల్లన్న ని ఒక్కడినే ఇంట్లో కి పంపించి తలుపు వేస్తారు. 

ఇక మాయాబజార్ లో పప్పు సర్ లాగ వియాల వారి విందు అహహ్హ నాకే ముందు అని కుమ్మేయాలి...అక్కడే ఒక చుట్ట ఉంటుంది..దాన్ని ముట్టించి నోట్లో పెట్టుకొని, చెయ్యి కడుక్కోకుండా ఆ నామాలు పెట్టిన బండ ని చేత్తో పట్టుకొని  వచ్చి తలుపు తట్టాలి..బయట నుంచి మూడు సార్లు అడుగుతారు"అయిందా మల్లన్నా?" అని...ఎం మాట్లాడకూడదు..ఊ అనాలి అంతే. అప్పుడు తలుపు తీస్తారు...

ఇక అక్కడ నుంచి నడుస్తూ ఊరి చివరి వరకు వెళ్ళాలి..మధ్యలో చాల మంది నవ్వించడానికి చూస్తారు, నవ్వకూడదు.. కొంతమంది గోచి కూడా లాగేస్తారు...ఐన సరే ఊరి చివరకి వెళ్లి ఆ రాయి అక్కడ పెట్టి చెయ్యి కడుక్కొని రావాలి...

నేను అందరి కన్నా ముందు తినేసి వెళ్లి వచ్చి గోల చెయ్యడానికి రెడీ గ ఉండే వాడిని...పొద్దున్నే వెళ్లి ఎవరి రాయి వాళ్ళు వెతుక్కునే వాళ్ళం...ఓ సారి రెండు ఇళ్ళకి  మల్లన్న గా ఉండే అవకాశం వచ్చింది...కొంచెం కూడా సందు ఇవ్వకుండా కూర్చోబెట్టారు...ఏదో మానవ ప్రయత్నం చేసా...


దాదాపు గా ఇరవై ఏళ్ల నుంచి ఆ పండగ చెయ్యలేదు...చిన్నప్పుడు మా అమ్మ ని అడిగా "మా మల్లన్న పండగ  ఎప్పుడు, అన్ని పండగలు వస్తున్నయి..మల్లన్న పండగ రాదా" అని...తిట్టింది..ఆ ఎప్పుకప్పుడు రాకపోదా అని ఎదురు చూసా..వయసొచ్చింది.పండగ మాత్రం రాలా..హ్మ్మ్ 

3 comments:

  1. కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ మాయాబజార్ లో పప్పు సర్ లాగ

    బావుంది మీ మల్లన్న పండగ,ఇదే మొదటిసారి వినడం ఈ పండగ గురించి.మా పక్కన నందికేశుడి నోము అని చేసేవారు,ఆ రోజు ఆహా ఫుల్లుగా లాగించడమే పరవాణ్ణం గిన్నెలతో సహా.(అంటే ఒక్కోసారి మనం ఉన్నామో లేమో చూసుకుని మరీ ఆ నోము చేసుకొనేవారన్నమాట)

    ReplyDelete
  2. ఈ పండుగ గురించి వినలేదు . ఇప్పుడు చేయటం లేదా ఎందుకని ?

    ReplyDelete
  3. chaalaa baagavu vrasavu naresh,kaani panduga kosam karuvu korukokoodadu.
    ayite idi bhale tamaashaagaa undhi

    ReplyDelete