ఓ నిర్ణయం మన భవిష్యత్తుని నిర్దేశిస్తుంది

by 10:59 PM 5 comments
 2004 లో రాజశేఖర్ రెడ్డి గెలవాలని  తపించిన వాళ్ళలో నేనొకడిని...గెలిచాక ఎదో మా ఇంట్లో పండగలా సంతోష పడ్డాము...ఇప్పటికి మా ఇంట్లో ఆయన అంటే అభిమానం, వాళ్ళకి అందాల్సింది వాళ్ళకి అందింది కాబట్టి..అది చంద్రబాబు చేయలేకపోయాడు కాబట్టి... కానీ చంద్రబాబు చేసింది పల్లెటూరి దాక చేరలేదు.IT అభివృద్ది, రోడ్ల నిర్మాణం, ప్రభుత్వ ఉద్యోగులు సక్రమంగా పని చేయడం, విదేశి పెట్టుబడులు. అంత లాభం కాకపోయినా, ప్రజలకి మేలు జరిగింది. ప్రత్యక్షం గా అందలేదు, అందుకే ఎందరికో చంద్ర బాబు పరిపాలన చేదుగా ఉంటుంది. రైతులు కష్టల్ల్లో ఉన్నప్పుడు ఉదాసీనం గా వ్యవహరించడం ముఖ్యమైన తప్పిదం.

అంతా అయ్యాక ఆనందం ఆవిరయ్యింది. పథకాల పేరిట నిధుల మళ్లింపు , నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ ఆస్తుల  సంతర్పణ,నిత్యావసర వస్తువుల  ధరల పెంపు, రాష్ట్ర విభజన నినాదాన్ని  ఒక పార్టీ పతనానికి వాడుకోవడం, ప్రభుత్వ సంస్థలు నష్టాల్లోకి వెళ్ళడం. అలా అని అన్ని  చార్జీలు పెరిగాయి. అయినా నష్టాల్లోనే ఉన్నాయి... విపరీతం గా పెట్రోల్ ఉత్పత్తుల ధరల పెంపు. రియల్ బూమ్ పేరుతో   సామాన్యుడికి అందకుండా పోయిన స్థలాల ధరలు...సిమెంట్, ఇనుము, ఇసుక అన్ని రేట్లు పెరిగాయి.సామాన్యుడి ఆశ బంగారం, వెండి ఆకాశాన్ని తాకాయి.. విభజన సెగల్ని సాకుగా చూపి ఎన్నో ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, IT పార్క్ లు పక్క రాష్ట్రాలకి తరలి పోయాయి..వాటి ని మన రాష్ట్రానికి తీసుకురావడం మానె అందులో కూడా స్కాం  చేసారు కొందరు మేధావులు...

ఇక దేశమంతా తీసుకుంటే కాంగ్రెస్ పాలనలో జరిగినన్ని స్కాం లు ఎక్కడ జరిగి ఉండవేమో..మీ కోసం ఈ లింక్..

http://en.wikipedia.org/wiki/List_of_scandals_in_India 

కాదేది దోచుకోడానికి అనర్హం అన్నట్టు ప్రతిదాన్లో మంత్రులు, అధికారులు తలా ఒక చెయ్యి వేసి పాల్గొన్నారు...

దాదాపుగా యాభై లక్షల కోట్ల అవినీతి జరిగింది..ప్రతి దాన్లో మంత్రుల హస్తం ఉంది... ఏదైనా ఒక చట్టం చేసి ఆ నల్లదనాన్ని వెనక్కి తీసుకురావడానికి వాళ్ళు చెప్పే సాకులు వినాల్సిందే...

ఇక నిత్యావసరాల ధరలు ఎలా పెరిగింది చూస్తే ఆశ్చర్యం వేస్తుంది...మనం ఎన్నుకున్న ప్రభుత్వం మనల్ని దోచుకోడానికే అన్నట్టుంటుంది...పండించే రైతు నష్టపోతున్నాడు, కొనే వినియోగదారుడికి గిట్టుబాటు కావడం లేదు. మరి బాగుపడుతుంది ఎవరు? ఎం పని చెయ్యకుండా ఉన్న దళారులు... వీళ్ళు ప్రతి రంగం లో ఉన్నారు, దోచుకున్నారు, శాసించారు.. 

బియ్యం,పప్పు,ఉప్పు ఇది అని లేకుండా అన్ని పెరిగాయి..గ్యాస్ మీద నియంత్రణ కూడా పెట్టారు..సామాన్యుడిని ఆదుకోడానికి ఎ విధంగాను ప్రయత్నం జరగలేదు..పెట్రోల్ కంపెనీల మీద నియంత్రణ ఎత్తివేయడం వల్ల వాళ్ళ ఇష్టానుసారం పెంచుతున్నారు...కొత్తగా డీజిల్ మీద ఎంత పెంచాలో అన్నది ఆ కంపనీ లకే వదిలేసారు...

సెజ్ ల పేరు చెప్పు వేల ఎకరాలని అప్పనం గా ఎవడికో కట్టబెట్టడం...ఎవరు బ్రతుకుతున్నారు?

ఇక విద్యుత్ బిల్లుల పెంపు..ఇది ఎవరికీ అర్ధం కాని ఓ పజిల్...2009, 2010 సంవత్సరాలకి గాను విద్యుత్ చార్జీల బకాయిలని ఇప్పుడు వసూలు చేస్తున్నారు..http://www.kseboa.org/news/power-tariff-hiked-in-andhra-pradesh-from-april-1-02042155.html... ఎవరు అడిగారయ్యా పథకాల పంపకాలు...ఇపుడు మా మాడు పగులుతుంది....

ఇక వాట్,  సేల్స్ టాక్స్, సర్వీస్ టాక్స్ ఇలా పన్నుల రూపంలో సామాన్య ప్రజల ప్రాణాలు తోడేస్తున్నారు...

రిటైల్ రంగం లోకి విదేశి పెట్టుబడులని ప్రత్యక్షంగా అనుమతించడం....

మైనారిటీ ల సక్షేమం పథకాలు.ఆ పథకాల వల్ల లాభ పడ్డ కొందరు, వాళ్ళే మైనారిటీలు గా చెలామణి అవుతున్నారు...అవసరం లో ఉన్న వాళ్ళు మాత్రం ఇంకా ఎదురు చూపులు చూస్తూనే ఉన్నారు.. అంతే కాకుండా  ఇతర కులాల్లో ఆర్ధికంగా వెనుకబడ్డ వాళ్ళు వెనుకబడ్డ వాళ్ళుగా గుర్తించబడలేదు...దానికి కులమే అడ్డం...

ఇక ఎన్నో అంతర్జాతీయ సమస్యలు...అరుణాచల్ ప్రదేశ్ ని చైనా లో అంతర్భాగం గా చైనా చెప్తూ ఉన్నా, ఇంటర్నెట్ లో అన్ని మ్యాప్ లో అరుణాచల్ ప్రదేశ్ ని డాట్స్ తో గుర్తిస్తున్నా కనీసం ప్రభుత్వం పట్టించుకోకపోవడం.

ఎన్నో తీవ్రవాద దాడులు జరిగినా పోటా లాటి చట్టాలని తిరిగి తీసుకురావడానికి ఏమాత్రం మనసు రావడం లేదు. నిన్న గాక మొన్న మన సైనికుల మీద దాడి చేసి తలలు తీసుకెళ్తే ధాటిగా సమాధానం చెప్పే దమ్ము లేకపోయింది...

ఇదంతా ఎందుకంటే అప్పటి నుంచి జరిగిన నష్టాన్ని ఉటంకించడమే...  భారత ప్రజలకి భవిష్యత్తు మీద భరోసా ఇవ్వడానికి యువరాజు రాబోతున్నాడు...

ఇక ఉంది మన చేతుల్లోనే..మీకు ఎవరు కావాలి? ఎలాటి ప్రభుత్వం కావాలి? ఒక నిర్ణయం తీసుకునేప్పుడు ఎప్పుడు మన అభిప్రాయం అడిగలేదు.. వాళ్ళ ఇష్టానుసారం గా తీసుకున్నారు...మనకున్న అవకాశం ఓటు వెయ్యడం... నేను ఎవ్వరిని బలపరచడం లేదు.. వచ్చే ఒక్కరోజు కులం,మతం,డబ్బు ఇవన్ని పక్కన పెట్టి దేశ భవిష్యత్తు ని దృష్టిలో పెట్టుకొని ఓటు వేద్దాం...అది మన భవిష్యత్తుని నిర్దేశిస్తుంది...





5 comments:

  1. i agree with you.
    chandra babu naidu vunnapudu inni goralu jaragaledandi.

    As a daughter of a government teacher , i can say that teachers used to really work hard when chandra babu naidu as CM.

    mana government employees ki pani cheyalante edustaru.anduke pani cheyinche CM vallaku nachaledu.

    ReplyDelete
    Replies
    1. శ్రావ్య గారు, కాని అంత కటువుగా ఉండే చంద్రబాబు ని ఇక చూడలేం..మనిషి లో భయం ఏర్పడింది..ఎక్కడో ఓ రోడ్డు ప్రమాదంలో పిల్లల బస్ కి ఆక్సిడెంట్ అయితే సంబంధిత అధికారుల్ని వెంటనే సస్పెండ్ చేసిన చరిత్ర..కాని తెలంగాణా విషయంలో సంస్థాగతం గా ఎంతో బలంగా ఉన్న TDP నాలుగు సీట్లు ఉన్న తెరాస ప్రయోగాన్ని అడ్డుకోలేకపోయింది..అదే ఆ రోజు తెలంగాణా లో MLA లు ఎక్కువగా ఉన్న TDP కనుక మీరెవరు తెలంగాణా ఇవ్వడానికి తేవడానికి, ఏది చేసిన బలమైనా మేమే అన్నట్టైతే ఈ రోజు దాని పతనాన్ని చూడాల్సిన అవసరం లేకుండా పోయేది..

      ఇక టీచర్లు ఆ రోజుల్లో ఎక్కువ కాలం బడుల్లో ఉండాల్సి వచ్చేది..శ్రమదానం, జన్మభూమి లాటి కార్యక్రమాల కోసం నిత్యం బడులను సందర్శించేవాడు..ఆకస్మిక తనికీలు కూడా అయన కొంప ముంచాయి...ఈ రోజు ఇంటికొకడు అమెరికా లో ఉద్యోగం చేస్తున్నాడంటే అది అయన చలవే...చాల మందికి అందని ద్రాక్ష గ ఉన్న ఇంజనీరింగ్ విద్య ని దించిన ఘనత కూడా ఆయనదే..ఇక ఇప్పటి వాళ్ళు వాటిని ఇబ్బడి ముబ్బడిగా పెంచేసి దాని విలువని దిగజార్చారు..ఇక ప్రభుత్వ ఉద్యోగులు..ఎందుకు పని చేయరండి? చేసారు..కాని చెయ్యని వాళ్ళని ఎలా దండిచాడో చేసిన వాళ్ళని అలా మెచ్చుకోలేదు, ఇది మీ విధి అన్నట్టు ప్రవర్తించాడు..తప్పే కదా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా..thanks for commenting

      Delete
  2. యధా రాజా తధా ప్రజ...దొంగ పాలకులు ప్రభుత్వాలు,దొంగ రాజోద్యోగులు...దొంగ వోటర్లు!అందుకే దేశం ఇలా ఏడ్చింది,మీరు చెప్పకపోయినా నే చెప్తా భా జాపా కి సంపూర్న మెజారిటీ వచ్చేలా వోట్ వేయండి,అప్పుడు నరేంద్ర మోడి అనె పని చేయగల సమర్థుడైన నాయకుడు వస్తాడు.తను గుజరాత్ లో పని బాగా చేసి నిరూపించుకున్నాడు అతనికె ఏ అమ్మా ..వెనుకనుండి అందివాల్సిన పనిలేదు,మన నాయకుల లాగా...అమ్మకు జలుబొస్తే ఇక్కడ తుమ్ముతారు...అమ్మకి తలనొస్తే ఇక్కడ జండూబాం రాస్తారు...అమ్మకి వాంత్..... ఒద్దులెండి!!

    ReplyDelete
    Replies
    1. నరసింహ గారు, "యధా రాజా తధా ప్రజ...దొంగ పాలకులు ప్రభుత్వాలు,దొంగ రాజోద్యోగులు...దొంగ వోట" దీనికి నేను ఏకీభవించను..సరే ఒక ప్రశ్న, మీ నియోజకవర్గ MLA మంచివాడు కాదు కాని ఆ పార్టీ నాయకుడు మంచివాడు అందుకుందాం...అప్పుడు మీరు రాష్ట్రప్రయోజనాలని దృష్టి లో పెట్టుకునే వాళ్ళైతే ఆ పార్టీ కె వోటేస్తారు.లేదా మీ నియోజక వర్గంలో మంచి వాడికి వోట్ వేస్తారు.చాల ఊర్లలో మా కులం, మా వర్గం, పరువు ఇలాటివి పరిగణలోకి తీసుకొని వోట్లు వేస్తారు...దాన్ని ఆపాలంటే మంచి వాళ్ళని నిలబెట్టాలి, ఎందుకు మంచి వాళ్ళో చెప్పాలి...

      ఇక గుజరాత్ ముఖ్యమంత్రి మోడీ గొప్ప నాయకుడే కావచ్చు కానీ ఇక్కడ BJP ఎవర్ని నిలబెడుతుంది? అసలు BJP అనే పార్టీ ఉందా? BJP పార్టీ లో ఎంతమంది అవినీతిపరులు లేరు?

      కాని ఇలా వారసత్వ పాలనా, ఏక పక్ష పాలనని వ్యతిరేకించాలి? "మన నాయకుల లాగా...అమ్మకు జలుబొస్తే ఇక్కడ తుమ్ముతారు...అమ్మకి తలనొస్తే ఇక్కడ జండూబాం రాస్తారు...అమ్మకి వాంత్..... ఒద్దులెండి!!" పూర్తిగా ఏకీభవిస్తున్నాను... మనకి ఒక మొండి నాయకుడు కావాలి..దేనికైనా ప్రజా శ్రేయస్సు కోసం ఎదురొడ్డే వాడు కావాలి..ఎవరైనా గుర్తుకు వచ్చారా? నందమూరి తారకరామారావు గారు, ఈయన్ని ఒక కులాని వారసుడిగా ప్రకటించుకున్నారు..కాదు అచ్చమైన తెలుగు వాడు..ఢిల్లీ డీ కొట్టిన ధీరుడు...thanks for your comment

      Delete
  3. "గెలిచాక ఎదో మా ఇంట్లో పండగలా సంతోష పడ్డాము"
    దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఏ రాజకీయనాయకుడు (అదీ మన రాష్త్రంలో) ప్రజలకి సేవచేయాలని తాపత్రయపడ్డాడు అని ఒక్కసారి ఆలోచిస్తే ఇలాటి "పండగలు" మనసులోకి రావు!!

    ReplyDelete