శివుడు - మధుబాబు

by 9:44 PM 2 comments
మళ్ళి ఓ హీరో పుట్టాడు...

షాడో....

కాళికాలయం లో వసంతుడు, బలదేవుడు....
ఆనంద జ్యోతి లో శ్రీధరుడు..
మచ్చలగుర్రం లో చంద్రుడు...
చతుర్నేత్రుడు లో మాధవుడు...
స్వర్ణ ఖడ్గం లో ప్రతాపుడు...
వెన్నెల మడుగు లో విజయుడు...

ఇప్పుడు  శివుడు....


మధు బాబు కథానాయకుడంటే ధీరో, నిర్లక్ష్యం నిండిన చూపులు, పెదాల మీద చెరగని  చిరునవ్వు. ఆపద లో ఉన్నవాళ్ళని  ఆదుకోడానికి  ప్రత్యక్షమౌతాడు, ప్రమదాలని లెక్క చెయ్యడు...


నాకు బాగా నచ్చేది ఆయన కథ చెప్పే విధానం.అందులో వాడే పేర్లు. అవి చదువుతూ ఉంటె అవి మన ఊహల్లో మెదులుతాయి. మనమే వాటికీ ఓ రూపాన్ని అపాదిస్తాము...


పై పుస్తకాల్లో నాకు బాగా నచ్చిన పుస్తకం షాడో తరువాత కాళికాలయం. మొత్తం మూడు భాగాలు... 


కాళికాలయం...కంకాళ లోయ..కళ్యాణ తిలకం....


ముందు ఈ రోజు నవ్య లో  ప్రారంభం ఐన 'శివుడు' గురించి చెప్తాను....


శివుడు అనే పదమూడేళ్ళ బాలుడు  ఓ అనాధ. వాడు సారంగుడు అనే ఓ  మండలాధీసుడి దగ్గర పెరుగుతూ ఉంటాడు...తనతో పాటు ఇంకో పది మంది అనాధల్ని(తల్లి తండ్రులు ఉండి ఆర్ధిక స్తోమత లేని వాళ్ళు  ) పెంచుతుంటాడు సారంగుడు..వాళ్ళకి విధ్యబుద్ధుల్ని నేర్పించి తన సంస్థానంలోనే వారి వారి ప్రావీణ్యాన్ని బట్టి కొలువు ఇస్తాడు...


ఓ రోజు కోట గోడల్ని ఆనుకోని ఉన్న మైదానం లో మిగతా పిల్లల్ని ల తో కలిసి ఆడుకుంటూ ఉన్న శివుడిని అమ్మ, నాన్న లేని వాడని తోటి వాళ్ళు హేళన చేస్తారు... కోపం తో ఒకడి మెడ పట్టుకొని బిగిస్తాడు (మధు బాబు గారిలా చెప్పడం రాదండి)...ఈ లోగ కాపలా ఉన్న భటులు రావడం..అక్కడ నుంచి పారిపోయి(పారిపోవడం అంటే చిరుత వేగం తో ), దగ్గరలో ఓ పండ్ల తోటలోకి వెళ్ళి మిగల మగ్గిన రెండు పండ్లని కోసి, గమనించిన ఆసామి నుంచి తప్పించుకొని పారిపోతాడు...కోట లోకి వెళ్దాం అనుకుంటుండగా దగ్గర లో ఉన్న ఓ పొదల నుంచి ఓ ఆడగొంతు  ఆర్తనాదం.... ఏదైతే అది అవుతుంది  అని వెనక్కి వెళ్ళి చూస్తే నది వడ్డున ఉన్న ఓ పడుచు నదిలో కొట్టుకు పోతున్న తన పసివాడి ని చూసి అరుస్తూ ఉంది..వెనకా ముందు చూడకుండా దూకేసాడు శివుడు..దూరం గా ఉన్న ప్రకీర్తి పర్వత సానువుల్లోంచి దూకుతున్న సువర్ణ నది ప్రవాహం ఉధృతం గా ఉంది(పేర్లు భలే ఉన్నాయి కదా? )...మొత్తానికి పిల్లవాడిని కాపాడతాడు శివుడు అలానే ఆ తోట కాపలా వాళ్ళకి పట్టుబడతాడు...


అక్కడ నుంచి సభలో కొలువుతీరి దోపిడీ ముఠా కి  శిక్షి విధిస్తున్న సారంగుడి ముందు ప్రవేస పెట్టబడ్డాడు ... శివుడు చేసిన మంచి పనిని మనసులోనే మెచ్చుకుంటూ గజశాలని ఊడ్చే శిక్షని విధించాడు....


ఇంకా కొంచెం ఉంది...నచ్చితే నవ్య కొని చదవండి....


2 comments:

  1. ఈ మద్యే కొత్తగా మీ బ్లాగు చదవటం మొదలెట్టను. మీ ఆకాశవాణి అందించే అందరికీ నచ్చే విషయాలు, వాటిని చెప్పే తీరు ఆకట్టుకునేట్టుగా బాగున్నాయి నరేశూ :)

    ReplyDelete
  2. ఈ మద్యే కొత్తగా మీ బ్లాగు చదవటం మొదలెట్టాను. మీ ఆకాశవాణి అందించే అందరికీ నచ్చే విషయాలు, వాటిని చెప్పే తీరు ఆకట్టుకునేట్టుగా బాగున్నాయి నరేశూ :) :) :)

    ReplyDelete