అది 2002 సంవత్సరం, చదువుకుంటూ ఇంటి వెనకే ఉన్న CD షాప్ లో అప్పుడప్పుడు సినిమా చూసే రోజుల్లో, అక్కడ ఉన్న రాక్ లో పైన ఓ మూలన దుమ్ముగోట్టుకుపోయి ఒక cd పెట్టి ఉంది. దాని మీద రాజులు కత్తులు పట్టుకొని నిలుచున్న మనుషులు చూసి ఇదేదో రాజుల సినిమా ల ఉందే అని తీసుకెళ్ళి చూసా.అందరూ ఏంట్రా బోరింగ్ గా ఉంది అన్నారు, నాకైతే ఇంకో ప్రపంచాన్ని చూసినట్టుంది. అప్పటికి ఇంకా ఇంగ్లీష్ తలకి ఎక్కలేదు. అప్పటికి కొన్ని ఇంగ్లీష్ సినిమాలు చూసాను, బావున్నాయనిపించింది.
మొదటి సారి “LORD OF THE RINGS” లో మొదటి భాగం “the fellowship of the ring” చూశాక ఓ అధ్బుతం
అనిపించింది. ఓ పుస్తకం చదివాక అది మన అంచనాకి తగ్గట్టు ఉండదు, ఎందుకంటే మన ఊహా
గొప్పగా ఉంటుంది. మొదటి సారి ఆ సినిమా నా ఊహా ని తృప్తి పరిచింది. ఆ సినిమా మళ్ళీ
మళ్ళీ చూసాను, ప్రతి సారి ఎదో కొత్త విషయం తెల్సేది. అసలు ఇలా తీయోచ్చా ? ఆ
లొకేషన్స్ ఏంటి? కాస్ట్యూమ్స్, ఒక కొత్త భాష, ఎన్నో పాత్రలు, అద్భుతమైన కట్టడాలు,ఆకాశాన్నంటే
భవనాలు,విగ్రహాలు. బాగా నచ్చినది కథ. ఎక్కడో చిన్న ఊర్లో మొదలైన కథ ఎంతో మంది
కలుపుకుంటూ ఎన్నో మలుపులు తిరుగుతూ అద్భుతాలను పరిచయం చేస్తు వెళ్తుంటే ఆ లోకంలో
విహరించడం తప్ప ఎం చేయలకేపోయా.
అప్పటికి హాలీవుడ్ గురించి పెద్దగా
తెలీదు. రింగ్ అని కనపడిన ప్రతి సినిమా వదలకుండా చూసే వాడిని. ఎన్ని CD షాప్ లు
తిరిగానో. కొన్ని రోజులకే మా షాప్ వాడే
LOTR లో రెండవ భాగం “the two towers”
తీసుకువచ్చాడు. అందులో పడి కొట్టుకుపోయాను. ఇంకో
సంవత్సరానికి (నాకైతే ఆ ఒక సంవత్సరం రెండేళ్ళలా తోచింది. ) మూడవ భాగం “The return of the King” వచ్చింది. అది చూసి సంతోషంతో పాటు బాధ కూడా అనిపించింది. LOTR
ఐపోయినందుకు. అందులో రాజులు , కోటలు, మాయలు , మంత్రాలు, రాక్షసులు, మాట్లాడే డ్రాగన్
లు , ఎన్నో జాతుల మనుషులు ప్రతిదీ అద్భుతం. చిన్నగా నడిచే కథ. ఓపిగ్గా చూస్తే
నచ్చుతుది.
అప్పటి నుంచి పీటర్ జాక్సన్ మేనియా
పట్టుకుంది. ఆయన తీసిన “కింగ్ కాంగ్” కూడా అలానే అద్భుతం లా చూసా.
మళ్ళీ పీటర్ జాక్సన్ “ది హాబిట్” అనే
సినిమా మొదలు పెట్టాడని. మళ్ళీ మబ్బుల్లో తేలా. పదేళ్ళ తరువాత అంటే 2012 లో హాబిట్
సిరీస్ మొదలైంది. లార్డ్ అఫ్ ది రింగ్స్ కి ముందు ఎం జరిగిందో చెప్పడం కథ. మళ్ళీ ౩
భాగాలు.( An Unexpected Journey (2012), The Desolation of Smaug (2013),
and The Battle of the Five Armies (2014))...
ఈ రోజుతో మూడవ భాగం కూడా ఐపోయింది. ఈ రోజే
చివరి భాగం చూసా. IMAX వాడిని అడుక్కొని అయినా మళ్ళీ మొత్తం ఆరుభాగాలు ఒకే రోజు
అదే స్క్రీన్ మీద చూడాలని ఆశ.
ఇది రివ్యూ కాదు. స్వోత్కర్ష. ఇలా ఉంది
అని చెప్పడానికి అది ఒక రోజులో తీసిన సినిమా నే కాదు. దాదాపు 12 ఏళ్ళ పాటు తీసిన సినిమా.
బలమైన చెడు మీద బలహీనమైన మంచి, ఆ మంచి
చేయాలన్న కొందరి ప్రయత్నం ఎలా గెలిచింది అన్నదే కథ.
ప్రతి పాత్రకి ఒక కథ ఉంటుంది, ఒక
వ్యక్తిత్వం ఉంటుంది. ఈ రోజు చాల బాధ అనిపించింది సినిమా ఐపోయినందుకు.
This comment has been removed by the author.
ReplyDelete