ఓ ప్రయాణం 3

by 4:53 PM 2 comments

ముందు భాగాలు
1.http://aakaasavaani.blogspot.in/2013/09/blog-post_6126.html 2.http://aakaasavaani.blogspot.in/2013/09/blog-post_30.html 3.http://aakaasavaani.blogspot.in/2014/01/blog-post_15.html
http://aakaasavaani.blogspot.in/2014/06/blog-post.html
http://aakaasavaani.blogspot.in/2014/11/2.html









కాలం సాగిపోతూ ఉంది. ఇలా కూరగాయలుపండించడానికి ఉత్సాహం చూపించే రైతులు ఎక్కువయ్యారు. దీనికి  పరిష్కారం చూపించాలి.
ఈ విషయం గురించి నాన్నతో మాట్లాడాడు వంశీ. తన ఆలోచనని,  అందులో కష్టనష్టాలని వివరించాడు. పెట్టుబడి సమస్య ఐంది. ఇది రైతులకి చెప్తే నిరుత్సాహపడతారు. స్నేహితులు షాప్స్ అద్దెకు తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేసి అమ్మెంత వరకు పర్లేదు కానీ వ్యవసాయానికి పెట్టుబడి అంటే ఆలోచనలో పడ్డారు. అదేమీ చిన్న విషయం కాదు. ఈ 3 నెలల వరకు ఇబ్బందేమీ లేదు. ఈ లోగా ఏదైనా చేయాలి.

ముందుగా కొత్తగా చేరే రైతులను లెక్క వేస్తే 10 మంది అయ్యారు. దాదాపు 10 ఎకరాల భూమి. పెట్టుబడి ఎంత కాదన్నా తక్కువలో తక్కువ 5 లక్షలు అవుతుంది. పక్క ఊర్లో ఉన్న గ్రామీణ బ్యాంకు మేనేజర్ తో మాట్లాడాడు వంశీ. తన ప్రయత్నాన్ని, అందుకు అయ్యే ఖర్చుని వివరించాడు. ఆ బ్యాంకు మేనేజర్ కుర్రవాడు, ఈ మధ్యనే మేనేజర్ గా పదోన్నతిపొందాడు. అతను కూడా ఉత్సాహంగా ఉన్నాడు,  మరి అలా అప్పు రైతులకి మాత్రమే  ఇవ్వడానికి కుదురుతుంది.
ఇక్కడ నాన్న సహాయం అవసరం ఐంది వంశీకి. రైతులందరినీ కూర్చోబెట్టి వివరంగా చెప్పాడు శ్రీనివాసరావు. రిలయన్స్ తీసుకున్న నిర్ణయం గురించి వివరించాడు,కొత్తగా చేరదాం అనుకున్న రైతులకు అయోమయంగా ఉంది. వారందరూ సిద్ధంగా లేరు. ఈ  పని కోసం కొందరు రైతులని ఎంచుకున్నారు.స్నేహితులతో కలసి పెట్టుబడి పెట్టడానికి  వంశీ సిద్ధమయ్యాడు.
ఈ పని చేయడంలో నష్టపోవడం కన్నా నమ్మకాన్ని బ్రతికించడం ముఖ్యం.

వంశీ ఆలోచన ఇలా ఉంది.
ఏదైనా కూరగాయలు కిలో 40రూ అమ్ముతున్న ఈ తరుణంలో, రైతులకి మిగిలేది మాత్రం కిలోకి 10 కన్నా తక్కువే. అలా కాకుండా కిలో 30 రూ లకి అమ్మి, రైతులకి 15 రూ ఇస్తే. మిగిలిన 15 రూలలో గ్రేడింగ్, రవాణా, షాపులకి అద్దె ఇవన్నీ కలిపాడు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే, మంచి ఫలితాలు వస్తాయి.
పంట వేసిన నాటి నుంచి కోతకి వచ్చేది 2-3 నెలల తరువాతే. అంటే దాదాపుగా పని మొదలైన నాటి నుంచి 6 నెలల పాటు ఉంటుంది ఈ పనంతా.
ముందుగా రైతులతో కలసి బ్యాంకు నుంచి లోన్ తీసుకోవడం వంశీ పని అయితే, పట్నంలో షాపులు అద్దెకు తీసుకోవడం,అక్కడ రవాణా,అమ్మడానికి కావాల్సిన మనుషులు ఇత్యాదివి అన్ని అతని స్నేహితులు చూసుకుంటారు.

వంశీ కి మధు సాయపడుతూ ఉంది. ఎంతెంత పెట్టుబడి అవుతుంది , మిగతా జామా ఖర్చులు,వంశీ స్నేహితులతో మాట్లాడటం ఇలా. వంశీ ఇక్కడ ఉద్యోగంలో చేరక మునుపే ఓ సెకండ్ హ్యాండ్ కారు కొన్నాడు.అప్పుడప్పుడు  కుటుంబమంతా కల్సి వారాంతాల్లో దగ్గరలో ఉన్న బంధువుల ఇంటికి, గుడికి వెళ్లి వస్తుండే వాళ్ళు.ఆ ప్రయాణాల్లో వాళ్ళ ఆలోచనలు కూడా పంచుకునే వాళ్ళు. ఇష్టమైన పని కోసం తపన పడ్డం ఎపుడూ కష్టం అనిపించదేమో. ఆ పనే వాళ్ళకి వెసులుబాటు,కాలక్షేపం,కబుర్లు. ఇంటిముందు,వెనక ఉన్న ఖాళీ ప్రదేశంలో పూల మొక్కలు, కూరగాయలు వేసారు. ఇంటి ముందు బాగా పెరిగిన కొబ్బరి చెట్లు పున్నమి వేళల్లో వెన్నల జారవిడిచేవి. రేపటి కోసం ఎదురు చూపు, పని మీద ఇష్టం, ఏదో సాధించాలన్న తపన మనిషిని ఎప్పుడు యవ్వనంగా ఉంచుతాయి.

వంశీ ప్రయత్నం సాగుతూనే ఉంది. దానితో పాటు చాటుగా నవ్వుకునే వాళ్ళు ఎక్కువయ్యారు.

రసాయనాలు లేని వ్యవసాయం చేయాలని సంకల్పించారు అందరూ. ఖర్చు తక్కువ ఉండటం తో రైతులు కూడా అటు వైపే మొగ్గుచూపారు. పని మొదలైంది. కూరగాయలు వెళ్తున్నాయి. రైతులు సంతోషంగా ఉన్నారు. చుట్టు పక్క గ్రామాల్లో ఈ పనికి గుర్తింపు లభించింది. 
తొందరలో ఇలానే బియ్యం, చిరు ధాన్యాలు చేయాలని ఆలోచన చేశారు. 

ఊరి చివర ఉన్న పోలేరమ్మ కి  జాతర చేయాలని అనుకున్నారు ఊరంతా... 
కొత్త ఉత్సాహం, ఆ ఊరు కళ కళ లాడిపోతూ ఉంది.. ఓ రోజు ఇంకో శుభవార్త తొందరలో ఆ ఇంట్లోకి ఇంకో కొత్త మనిషిరాబోతుందని... 
తల్చుకుంటే తన ప్రయాణం సంతోషాన్నిచ్చింది వంశీ కి.. 

ప్రతి పని  లోనూ కష్ట నష్టాలు ఉంటాయి , కానీ మనం చేసే పని మనకి సంతోషాన్నిస్తోందా.. అవును అయితే మనం బాగున్నట్టు, లేదంటే ఓ సారి ఆలోచించాల్సిందే... 






2 comments:

  1. awesome pics
    Hi
    We started our new youtube channel : Garam chai . Please subscribe and support https://www.youtube.com/garamchai

    ReplyDelete
  2. what a crazy blogs i'm following your blogs please give some suggestions please subscribe and support me
    my youtube channel garam chai:www.youtube.com/garamchai

    ReplyDelete